Saturday, April 26, 2014

కోవా లడ్డు

కోవా లడ్డు కావలసినవి

పాలపొడి - 200 గ్రా;
కండెన్స్డ్ మిల్క్ - 250 గ్రా
నెయ్యి - 100 గ్రా
కొబ్బరి తురుము - కప్పు; బెల్లం - 250 గ్రా
బాదంజీడిపప్పు పలుకులుకిస్మిస్ (నెయ్యిలో వేయించినవి) - 25 గ్రా.

కోవా లడ్డు తయారి


ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి, అవెన్లో పదిహేను నిమిషాలు ఉంచాలి. అవెన్లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది. కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలు(నిమ్మకాయ పరిమాణం)గా చేయాలి. కోవా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి.


నోట్: మౌల్డ్ సాయంతో చేయడం లేదా చేత్తో మోదక్లాగ చేసి, సన్నని పుల్లతో నిలువుగీతలు పెట్టాలి.

No comments:

Post a Comment