Saturday, April 26, 2014

మాడుగుల హల్వా

మాడుగుల హల్వా కావలసిన పదార్థాలు :

మైదాపిండి.. ఒక కప్పు
పంచదార.. రెండు కప్పులు
ఫుడ్ కలర్.. చిటికెడు
బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు.. కావాల్సినన్ని
యాలకులపొడి.. ఒక టీ.
నెయ్యి... ఒక కప్పు
యాలకుల పొడి.. తగినంత
కుంకుమ పువ్వు.. చిటికెడు

మాడుగుల హల్వా తయారీ విధానం :

బాణలిలో ఒక కప్పు నెయ్యి పోసి అందులో మైదాపిండిని వేయించాలి. ఇంకోవైపు గిన్నెలో పంచదార వేసి తీగ పాకానికి సరిపడా నీటిని పోసి పాకం పట్టాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఫుడ్కలర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడుకుతున్న మైదాపిండిలో బాదం, జీడి, కిస్మిస్లు, పంచదార పాకం వేసి గట్టిపడేదాకా తిప్పుతూ ఉండాలి. మంటను తగ్గించి పాత్రను దించేందుకు ముందుగా యాలకుల పొడి, కుంకుమపువ్వును జోడించాలి. అంతే మధురమైన వంటకం మైదా హల్వా తయార్.. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment