Saturday, April 26, 2014

అటుకుల హల్వా

అటుకుల హల్వా కావలసిన పదార్థాలు :

Atukula Halwa
అటుకులు : నాలుగు కప్పులు
పంచదార : ఒక కప్పు 
నెయ్యి : 3/4 కప్పు 
పాలు : రెండు కప్పులు 
ఏలకుల పొడి : చిటికెడు
కుంకుమ పువ్వు : కొంచెం 
జీడిపప్పు, బాదం, పిస్తా : అరకప్పు 


అటుకుల హల్వా తయారీ విధానం :
Atukula Halwa
కడాయిలో నూనె పోసి అందులో అటుకులను లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని వేసి కలపాలి. అటుకుల కాస్త ఉడికాక పంచదార, నెయ్యి చేర్చి కలియబెడుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం, పిస్తాలను నేతిలో వేపి హల్వాతో చేర్చి, చివరిగా ఏలకుల పొడి చల్లి దించేయాలి.

No comments:

Post a Comment