Monday, April 28, 2014

ఆలూ చిప్స్ recipe (అధిక బరువుకు విరుగుడు ఆలూ చిప్స్‌)

ఆలూ చిప్స్

పొటాలో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారంటూ ఇప్పటివరకూ ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్‌ వంటి చిరు తిల్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా అలాంటిదేమీ లేదని కొత్తస్టడీ తేల్చేసింది. బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలీఫోర్నియా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. బంగాళా దుంపలతో ఆరోగ్యానికి మేలేనని, బరువు తగ్గించే ప్రక్రియలోనూ బంగాళదుంపలు ఉపయోగపడుతాయి. దాదాపు 12 వారాల పాటు భారీ బరువుగల మహిళలు,పురుషులపై జరిపిన పరిశోధనలో బంగాళాదుంపలను తీసుకోవడం ద్వారా కెలోరీల శాతం తగ్గుముఖం పట్టడం, రక్తంలో సుగర్‌ లెవల్స్‌, కార్బోహైడ్రేట్లను నియంత్రిస్తున్నట్లు తెలియవచ్చింది. ఒక బంగాళాదుంపలో 110 కెలోరీలు, పొటాషియం 620 గ్రాములున్నట్టు గుర్తించారు. 
ఆలూ ----------------------1 కిలో , 
నూనె ----------------------300 గ్రా 
జీరా -----------------------1 టీ స్పూన్ , 
ఉప్పు--------------------- 1 టీ స్పూన్ , 
కారం -------------------- 1 టీ స్పూన్
ఆం చూర్ పోడి------------- 1 టీ స్పూన్ .
చేసే విధానం::

ఆలు బాగా కడిగి పొట్టు తీసి పలుచగా ఆలు చిప్$స్ కొట్టే పీటపై కొట్టాలి ఆలు చిప్$స్ ఒక పొడి బట్టపై వేసి, ఆరిన తరువాత , బాండీలో నూనె వేడి చేసి , బాగా వేడి అయిన తరువాత , ఆరిన చిప్$స్ పచ్చివి బాండిలో కొన్నివేసి వేయించి జల్లిగరిటతో తీసి పేపర్ పై వేయాలి . అలా అన్ని చిప్$స్ వేయించుకొని తీసి , మళ్ళీ 5 నిముషాల తరువాత నూనె వేడి చేసి చిప్$స్ ఎర్రగా వేయించాలి , అప్పుడు బేసిన్ లో తీసి , ఉప్పు , కారం , జీరా , ఆం చూర్ ,పొడి కలిపి తింటే చాలా బాగుంటాయి . రెండుసార్లు వేయించడం వలన చాలా కరకరలాడుతాయి . చల్లార్చి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి :)

No comments:

Post a Comment