Sunday, April 27, 2014

పెసర, కోవా స్వీట్

పసర, కోవా స్వీట్కావలసిన పదార్థాలు


పంచదార - పావు కిలో
పెసరపప్పు - పావు కిలో
పాలు - పావు లీటరు
కోవా - అర కప్పు
జీడిపప్పు, బాదంపప్పు,కిస్మిస్‌ - పావు కప్పు
యాలకుల పొడి - అర స్పూన్
నెయ్యి - 100 గ్రాములు
కుంకుమ పువ్వు/మిఠాయి రంగు - కొద్దిగా


పసర, కోవా స్వీట్తయారు చేసే విధానం

బాదంపప్పు నానబెట్టి పొట్టు తీసెయ్యాలి. జీడిపప్పు, కిస్మిస్నేతిలో వేయించాలి. నానబెట్టిన పెసరపప్పు ఉడికించి మెత్తగా రుబ్బాలి. బాండీలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో రుబ్బిన పెసరపప్పు మిశ్రమం, పాలు, పంచదార వరుసగా వేసి కలపాలి. మిశ్రమం ఉడికాక కోవా, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్మిఠాయి రంగు/కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత స్టౌమీద నుండి దించి నెయ్యి రాసిన పళ్లెంలో పొయ్యాలి. పైన బాదం పప్పులతో అలంకరించుకుని నచ్చిన ఆకారంలో కోసుకుంటే చాలు. పెసర, కోవా స్వీటు రెడీ

No comments:

Post a Comment