Sunday, April 27, 2014

కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం కావలసిన పదార్థాలు


పచ్చికొబ్బరి తురుము - 2 కప్పులు,
పాలు - 2 కప్పులు
బెల్లం/పంచదార - 300 గ్రాములు
జీడిపప్పు, బాదంపప్పు - కొద్దిగా,
యాలకుల పొడి - 1 స్పూన్
నేయ్యి - కొద్దిగా

కొబ్బరి పాయసం తయారీ విధానం

ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుములో నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్చేసి కొబ్బరి పాలు తీయాలి. జీడిపప్పును మెత్తగా పేస్ట్చేసి కొబ్బరి పాలల్లో వేయాలి. మిగిలిన ఒక కప్పు పచ్చి కొబ్బరిని నేతిలో వేయించాలి. పాలు మరగబెట్టి అందులో కొబ్బరి పాలు, నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి కలపాలి. కొద్దిసేపటి తర్వాత బెల్లం/పంచదార వేసి కలియదిప్పాలి. కొబ్బరి ఉడికిన తర్వాత వేయించిన జీడిపప్పు, బాదంపప్పు కలిపి దించితే చాలు. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాయసం రెడీ.

No comments:

Post a Comment