Saturday, April 26, 2014

జిలేబి

జిలేబి కావలసిన పదార్థాలు:


మైదా: 1 1/2cup
పెసర పిండి: 2tbsp
పంచదార(షుగర్ ఫ్రీ): 2tbsp 
పంచదార: 3cups
వంట సోడా చిటికెడు
నిమ్మరసం: 1tsp
యాలకుల పొడి 1/2 ts
నెయ్యి లేదా నూనె వేయించడానికి
కేసర్ రంగు చిటికెడు

జిలేబి తయారు చేయు విధానము:


మొదటగా మైదా, రెండు టేబుల్ స్పూన్ల పెసర పిండిలో వంటసోడా, ఒక స్పూన్ నెయ్యి, నిమ్మరసం, కేసర్ రంగు వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలిపిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది.మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కావాలంటే కాస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి. అందులోనే యాలకులపోడి కలిపాలిజిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి. జిలేబీలను కాస్త దోరగా వేయించి తీసి పాకంలో వేయాలి. పదినిమిషాలతర్వాత తీసి విడి పళ్ళెంలో తీసుకొని కొద్దిసేపు తర్వాత తింటే పాకం అంతా జిలేబిలకు పట్టి, కలర్ ఫుల్ గానే కాదు ఎంతో రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment