Sunday, June 29, 2014

టమోటా మసాలా బజ్జీ

Tomato Masala Bajji Recipe 
కావలసిన పదార్థాలు : 
టమోటాలు: 1/2 kg
బంగాళాదుంపలు: 1/2kg
నూనె:వేయించేందుకు సరిపడా
గరంమసాలా: 2tsp
కొత్తిమీర: 1cup
పెసరపప్పు: 4tsp
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 4
శనగపిండి: 1cup

తయారు చేయు విధానం:
1. టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో
గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి.
3. ఇప్పుడు ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు,
ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా
చేసుకోవాలి.
4. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జా రుగా
కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్
వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్ చట్నీ
కాంబినేషన్ చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment