Wednesday, June 18, 2014

పుదినా - టమాటో పచ్చడి


పుదినా  - టమాటో పచ్చడి రెసిపి
కావలసిన పదార్ధాలు :
పుదీనా . ఒక కట్ట
టమాటాలు . పావు kg
ఆవాలు . అర టీ స్పూన్
శనగపప్పు . టీ స్పూన్
మెంతులు . చిటికెడు
చింతపండు . కొద్దిగా
ఉప్పు . సరిపడా
పచ్చిమిర్చి . 4
ఎండుమిర్చి . 9
తయారుచేయు విధానము:
టమాటాలు ,పుదినా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
పాన్ పెట్టి కొంచం ఆయిల్ వేసి అందులో పుదీనా ఆకులు,టమాటా ముక్కలు పచ్చిమిర్చి, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి.
తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, మెంతులు,ఎండుమిర్చి వేసి వేగాక ఒక బౌల్ లో వేసి పెట్టుకోవాలి.మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
చివరిలో కొన్ని పుదీనా ఆకులూ కూడా వేసి అలంకరిచుకుంటే చట్ని రెడీ .....

No comments:

Post a Comment