Thursday, June 19, 2014

వంకాయ పచ్చిపులుసు


వంకాయ పచ్చిపులుసు



కావలసిన పదార్థాలు:

 (పెద్ద) వంకాయ - 1, 
ఉల్లిపాయ -1, 
చింతపండు - చిన్న నిమ్మకాయంత, 
బెల్లం తరుగు - అర టేబుల్ స్పూను, 
ఉప్పు - రుచికి తగినంత, 
క్తొతమీర - అర టేబుల్ స్పూను, 
తాలింపు కోసం - (సరిపడా) నూనె, 
ఎండుమిర్చి, 
ఆవాలు, 
జీలకర్ర, 
కరివేపాకు. 

తయారుచేసే విధానం:

 వంకాయను మంటలో బాగా కాల్చి, చల్లార్చి, తొక్కతీసి, మెత్తగా గుజ్జు చేసిపెట్టుకోవాలి. 
చింతపండు గుజ్జు తీసి, 3 కప్పుల నీరు చేర్చాలి. ఈ రసంలో వంకాయ గుజ్జు, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బెల్లం, ఉప్పు వేయాలి. తర్వాత తాలింపు వేసి ఈ మిశ్రమంలో కలపాలి. వేడి వేడి అన్నంతో వంకాయ పచ్చిపులుసు ఎంతో రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment