Wednesday, June 18, 2014

ఇన్స్టంట్ ఉసిరి ఆవకాయ

ఇన్స్టంట్ ఉసిరి ఆవకాయ


నిల్వ ఆవకాయలో నూనె,ఉప్పు కూడా కాస్త ఎక్కువ వేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా తినటానికి ఇష్టపడరు.అలాంటప్పుడు అప్పటికప్పుడు ఓ పదిహేను నిముషాల్లో ఇన్స్టంట్ గా ఉసిరి ఆవకాయ చేసుకోవచ్చు.

కావలసినవి :

ఉసిరికాయలు
ఎండుమిర్చి
ఆవాలు
పసుపు
ఉప్పు
నూనె
ఇంగువా

తయారీ విధానం :

ముందుగా నీటిని వేడిచేసి ఉసిరికాయలని  ఉడికించాలి. మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టుకుని చల్లార నివ్వాలి. ఉడికించిన ఉసిరికాయలు చల్లారాక ముక్కలుగా కోసి పెట్టుకుని వాటిలో చిటికెడు
పసుపు, ఉప్పు, కలపాలి.ఆవాలు,ఎండుమిర్చి,ఇంగువ, నూనెలో వేయించి  మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఆ పొడిని ఉసిరి కాయల మిశ్రమానికి కలిపి ఆపైన ఇంగువ,ఆవాలుతో పోపు చేస్తే  రుచికరంగా ఉండే ఉసిరి ఆవకాయ క్షణాల్లో సిద్దం.

Note :
 నీళ్ళల్లో ఉడికించటానికి బదులు కుక్కర్ లో ఆవిరి పెట్టినా ఉసిరికాయలు మెత్తబడతాయి.

No comments:

Post a Comment