Sunday, June 29, 2014

సేమియా తో పొంగల్

సేమియా తో పొంగల్
కావలసిన పదార్థాలు :
బాంబినో సేమ్యా : అర కిలో
జీడిపప్పు: 50 గ్రాములు.
ఎండుద్రాక్ష:20 గ్రాములు.
బెల్లం తురుము : 25 గ్రాములు.
కలాకండ్: పావు కిలో
పంచదార : అర కిలో
నెయ్యి:పావు కిలో
యాలకుల పొడి: ఒక స్పూన్.
పచ్చ కర్పూరం: కొద్దిగా
పెసరపప్పు: పావు కిలో
ఎండుకొబ్బరి తురుము: 100 గ్రాములు.
ఎండు ఖర్జూరం... 50 గ్రాములు.
తయారుచేసే విధానం :
ముందుగా సేమ్యలను ఉడక బెట్టి పక్కన పెట్టుకోవాలి .
తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుము,జీడిపప్పు, ఎండు ఖర్జూరం దోరగా వేయించి ఉంచాలి.
పెసరపప్పును ఉడికించి మెత్తగా చెయ్యాలి . మందపాటి మందపాటి గిన్నె తీసుకుని బెల్లం, పంచదార నీళ్లు పోసి పాకం పట్టాలి .
అందులోనే ఉడికించిన పెసరపప్పు, యాలకుల పొడి, కలాకండ్‌, వేయించిన డ్రైఫ్రూట్స్‌,కర్పూరం పొడి వేసి, నెయ్యి పోసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి.
తరువాత సేమ్యాను కూడా పాకంలో వేసి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

No comments:

Post a Comment