Thursday, June 19, 2014

వంకాయతో బజ్జి

కొబ్బరిపొడి

కాస్తా ఎండు కొబ్బరి పొడి 
ముకిడి లో వేయించిన ఎండు మిర్చి,పచ్చివెల్లుల్లి,ఉప్పు వేసి మిక్సీ వేయాలి 
కొబ్బరిపొడి రడీ!!!కొబ్బరిపొడి రుచి చేసి చూడండి 

పొడిలందు కొబ్బరిపొడి వేయా!!!!

గుత్తువంకాయ మల్లె  గాట్లు  పెట్టేసుకుని కాస్తా నునేలో వెయ్యి౦చి ప్రక్కనే పెట్టుకోవాలి..
వంకాయలు పూర్తిగా మగ్గకూడదు...
పుర్తి గా చల్లార్చాలి...
ఆ టైం లో బజ్జి పిండి కలపాలి 

 కొబ్బరిపోడిని వంకాయ మద్యలో కురేసి

 బజ్జి పిండిని ఎలా కలిపానంటే సెనగపిండిలో కొంచం బియ్యపిండి వేసి,జీలకర్ర చేర్చి,ఉప్పుకారం తగిలించి (కావాలంటే అల్లంవెల్లుల్లి వెయ్యవచ్చు)నీళ్ళుపోసి బజ్జి పిండిని తయారు చేసామా

మన వంకాయలు సూపర్ స్వీమ్మర్స్ నమ్మరా!!!అయితే బాగా కాగిన నునేలో వెయ్యండి ఇట్టే తేలిపోతాయి...ఇలా మళ్ళి నునె లో స్విమ్మింగ్ చేయిస్తే మగ్గల్సినవి మగ్గి నునె వేడికి కాస్తా ట్యాన్ అయిక గోల్డెన్ కలర్ కి వచ్చాక కుస్తా కారం గా చిల్లిగార్లిక్ సాస్ తో తింటే అబ్బ అబ్బ అంతే..

No comments:

Post a Comment