Friday, June 20, 2014

టమోటా పచ్చిపులుసు

కావలసిన పదార్థాలు:
చింతపండు గుజ్జు- 3 టీ స్పూన్లు, 
ఉల్లిపాయ- 1, 
పచ్చిమిర్చి- 3, 
(వేగించి తొక్క తీసిన) పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు, 
(వేగించిన) నువ్వులు-1 టేబుల్ స్పూను,
 ధనియాల, మెంతి, జీరా, కారం పొడులు - అర టీ స్పూను చొప్పున, 
ఉప్పు- రుచికి తగినంత, 
తాలింపుకోసం- (తగినంత) నూనెతో పాటు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ.

తయారుచేసే విధానం:
 పల్లీలు, నువ్వులు పొడి చేసి అందులో కారం, మెంతి, జీరా, ధనియాల పొడులు కలపాలి. చింతపండు గుజ్జులో 4 కప్పుల నీటితో పాటు పసుపు, ఉప్పు చేర్చి పక్కనుంచాలి. ఉల్లి, పచ్చి మిర్చి, టమోటాలను తరిగి పెట్టుకోవాలి. కడాయిలో తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు ఒక దాని తర్వాత ఒకటి వేగించి, పొడుల మిశ్రమంతో పాటు చింతపండు నీటిని కలిపి 5 నిమిషాలు మరిగించి దించేయాలి. 

No comments:

Post a Comment