Wednesday, June 18, 2014

మామిడికాయ చట్నీ

మామిడికాయ చట్నీ


కావాల్సిన పదార్ధాలు :-

మామిడి కాయలు - 3
ఆవాలు - అర స్పూన్
ఇంగువ - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
ఎండు మిరపకాయలు - 10
ఉప్పు - 2 స్పూన్స్
పచ్చి మిరపకాయలు - 5
పసుపు - చిటికెడు
నూనె - 2 స్పూన్స్

తయారీ:

ముందుగా మామిడి కాయలను బాగా కడిగి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .తరవాత ఒక బాండి తీసుకుని దానిలో నూనె వేసి మినపప్పు ,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు,ఎండు మిరపకాయలు, వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి.పోపు చల్లారాకా మిక్సిలో వేసి పచ్చి మిరపకాయలు ,ఉప్పు ,మామిడి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి. తరువాత తాలింపు వేసి చల్లారక పచ్చడిలో కలపాలి... 

No comments:

Post a Comment