Sunday, June 29, 2014

పాలతాలికలు

పాలతాలికలు 
కావాల్సినపదార్థాలు:
పాలు - ఒక లీటరు.
నీళ్లు - ఒక లీటరు. ‌
సగ్గు బియ్యం - ‌వందగ్రాములు.
బియ్యపిండి - వందగ్రాములు.
మైదాపిండి - రెండు టీ స్పూన్లు
పంచదార - 200గ్రా.
‌బెల్లం - పావుకేజి. ‌
జీడిపప్పు - కొద్దిగా.
‌కిస్‌మిస్‌ - కొద్దిగా. ‌
ఏలకులపొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - కొద్దిగా.
తయారుచేయువిధానం: 
పాలలో నీటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.
ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం
ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) చక్కిలాల పిండిలా
కలుపుకోవాలి. ఈ పిండిని చక్కిలాలను ఒత్తినట్లు మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. ఇవే
తాలికలు. ఇవి పాలలోనే ఉడుకుతాయి. ఒక తీగ మరొక తీగ మీద పడకుండా విడివిడిగా
వచ్చేటట్లు చూడాలి. ఒకదాని మీదకొకటిగా పడితే ఉడికేటప్పుడు కలిసి ముద్దవుతాయి.
తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు
ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పైన
రెండు స్పూన్ల నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు,
కిస్‌మిస్‌లతో అలంకరించాలి.

No comments:

Post a Comment