Sunday, June 29, 2014

బ్రెడ్ హల్వా

బ్రెడ్ హల్వా
కావలసిన పదార్థాలు
ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక కప్పు నెయ్యి
5-6 ఏలకులు
10 బాదం పప్పులు - నానబెట్టి, సన్నగా తరిగినవి.
7-8 కాజూ
ఒకటిన్నర కప్పు పంచదార
ఒక లీటరు పాలు
తయారీ విధానం:
బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి.
ఒక అరకప్పు నేతిని బాణెలిలో తీసుకోని, కొంచం వేడి అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించుకోవాలి.
బాదం, ఏలకులు, జీడిపప్పు సగం తీసుకోని ముద్దగా చేసుకోవాలి, మిగతావి నేతిలో వేయించికోవాలి.
పాలను ఒక గిన్నెలో తీసుకొని, మరగబెట్టి, దానికి పంచదారను కలపాలి. అది బాగా కలిసేంతవరకు కలియబెట్టుకోవాలి.
పంచదార బాగా కలిసిన తర్వాత, దీనికి మిగిలిన నెయ్యి, వేయించిన బ్రెడ్ ముక్కలు కలపాలి.
సన్నని సెగపై ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మెత్తగా ఉడకనివ్వాలి .
దీనిలో ఇప్పుడు జీడిపప్పు ముద్దను వేసి, కలుపుకోవాలి.
స్టవ్వు మీద నుండి తీసుకొని జీడిపప్పు, బాదం, ఏలక్కుల పొడి చల్లుకోవాలి.

No comments:

Post a Comment