Sunday, June 29, 2014

Purna Bhakshalu Recipes (బొబ్బట్లు)

Purna Bhakshalu Recipes 
కావలసిన పదార్థాలు:
* శెనగపప్పు: 1/2cup,
* మైదా: 1/2kg,
* ఏలకులు: 6,
* నెయ్యి: 1cup,
* వంటసోడా: చిటికెడు,
* పాలిథీన్‌ కవర్‌: 1,
* బెల్లం: 1/2kg,
* నూనె: సరిపడా,
* ఉప్పు: చిటికెడు.
తయారు చేయు విధానం: ముందుగా వెడల్పుగా ఉన్న ప్లేట్ లో మైదా జల్లించి దానికి వంటసోడా, ఉప్పు కలపాలి. అందులో నెయ్యి వేసి నీళ్లు పోసి జారుగా కలపాలి. ఈ మైదాకు మధ్యలో గుంట చేసి కప్పు నూనె పోసి ఆకు మూత పెట్టాలి. నీరు మరిగించి శనగపప్పుకి బెల్లం, ఏలకుల పొడి కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దని మనకి నచ్చినంత సైజు ఉండలు చేయాలి. నానిన మైదా ముద్దని నూనె పూసిన పాలిథీన్‌ కవరు మీద పరిచి, శెనగపప్పు బెల్లం ముద్దని మధ్య పెట్టి చుట్టూ మూసి భక్ష్యాన్ని పల్చగా వత్తి దళసరిపెనం మీద నెయ్యితో మాడకుండా కాల్చాలి. అతిధులకు ఇవి వడ్డిస్తే తినేందుకు ఎంతో రుచికరంగానూ వుంటాయి. అయితే వీటిని మాడనివ్వకుండా శ్రద్ధ వహించాలి.

No comments:

Post a Comment