Sunday, June 29, 2014

రవ్వ బొబ్బట్టు

Rava Bobbatlu Recipes 
కావలసిన పదార్ధాలు:
* రవ్వ: 1cup,
* మైదా: 2cups,
* గోధుమ పిండి: 1/2cup,
* పంచదార: 2cups,
* సోడా: చిటికెడు,
* నెయ్యి: 2tsp,
* నూనె: 1/2cup.
తయారు చేయు విధానం: ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు, వంట సోడా వేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించి ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూతా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతోలేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

No comments:

Post a Comment