Wednesday, June 18, 2014

టమోటా ఆవకాయ

టమోటా ఆవకాయ


కావలసినవి :
టమోటాలు- 1 కేజీ
చింతపండు - 150 గ్రాములు
కారం - 125గ్రాములు
ఆవాలు- 1 స్పూన్
ఉప్పు- పావు కేజీ
అల్లంవెల్లుల్లి పేస్ట్ - పావు కేజీ
నూనె- పావు కేజీ
మెంతిపొడి-25 గ్రాములు
జీలకర్ర - 2 స్పూన్లు
ఇంగువ - చిటికెడు
జీలకర్ర పొడి- 50 గ్రాములు

తయారీ  :
ముందుగా టమాటాలు కడిగి తుడుచి ముక్కలు కోసి నానపెట్టుకున్న చింపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి అందులో ఇంగువ, జీలకర్ర, ఆవాలు  వేయించి చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసిపెట్టుకున్న టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

No comments:

Post a Comment