Friday, June 20, 2014

అత్తిపళ్ల(అంజూర్) వెరైటీలు

అత్తిపళ్ల(అంజూర్) వెరైటీలు

కేక్‌
కావలసిన పదార్థాలు: 
అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్ చేయాలి), 
బటర్ - అరకప్పు, 
పంచదార పొడి - 2 కప్పులు, గుడ్లు - 4, మైదా - 1 కప్పు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బాదం (చిన్న పలుకులు) - అర కప్పు, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం:
 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని బటర్, పంచదార, గుడ్లు, బేకింగ్ పౌడర్, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద 'ప్రీ హీట్' చేసుకున్న ఓవెన్‌లో గంటసేపు ఉంచాలి. టూత్‌పిక్‌తో చెక్ చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్ చేసుకోవాలి. (ఓవెన్ లేనివాళ్లు కేక్‌పాన్‌లో కూడా చేసుకోవచ్చు)

జ్యూస్
 
కావలసిన పదార్థాలు: అంజూర్ డ్రై ఫ్రూట్స్ - 4, నీరు - 1 కప్పు, బెల్లం - 1 టేబుల్ స్పూను, యాలకులు - 2, అల్లం - అంగుళం ముక్క, తులసి ఆకులు - 5/6
తయారుచేసే విధానం:
 అంజూర్‌ని అరకప్పు నీటిలో దాదాపు 2 గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి. మరో కప్పు నీటిలో బెల్లం వేడి చేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి. గంట తర్వాత వడకట్టి కరిగిన అంజూర్ నీటిలో కలిపి తాగాలి.

 


జామ్
కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 1 కిలో, పంచదార - 700 గ్రా., కమలాపండు - 1, కమలా రసం - అర కప్పు.
తయారుచేసే విధానం:
 అత్తిపళ్లని నాలుగు ముక్కలుగా కట్ చేసి పంచదార కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మర్రోజు చిన్న మంటపైన ఉడికించాలి. జామ్ చిక్కబడ్డాక కట్ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలా రసం కలిపి దించేయాలి. బ్రెడ్‌తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్ ఇది.

No comments:

Post a Comment