Sunday, June 29, 2014

పులిహోర

పులిహోర 
కావాల్సినపదార్థాలు:
బియ్యం - 1 cup
చింతపండు - 2 నిమ్మకాయంతవి
పసుపు - 1 tablespoon
వేయించిన వేరుశెనగపప్పు - 2 - 3 tablespoons
ఉప్పు నూనె పోపు కొరకు ఆవాలు - 1 teaspoon
పచ్చి శెనగపప్పు - 1 tablespoon
జీల కర్ర - 1 tablespoon
ఎండు మిరపకాయలు - 4
తయారుచేయువిధానం: 
ముందుగ బియ్యం ని 2 cups నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నం ని
పక్కన చల్లారి పెట్టుకోవాలి పసుపు , ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు ని వేడి నీళ్ళల్లో
నాన పెట్టి రసం తీసి పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం పోసి
చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి వేరే పాన్ తీసుకొని తగినంత నూనె పోసి కాగాక
ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శెనగపప్పు ని వేయించాలి. వేగాక జీలకర్ర ని,
వేరుశెనగపప్పు ని, ఎండు మిరపకయాలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని అన్నం లో కలపాలి. తరువాత చింతపండు రసం ని బాగా
కలపాలి.

No comments:

Post a Comment