Sunday, June 29, 2014

కాజు కట్లి

కాజు కట్లి
కావలసిన పదార్థాలు:
జీడిపప్పు : ఒక కప్పు
పంచదార : ఒక కప్పు
ఏలకుల పొడి : అర స్పూన్
నీరు : నాలుగు స్పూన్లు
నెయ్యి : ఐదు స్పూన్లు
తయారీ విధానం : స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక జీడిపప్పును సన్నని సెగపై దోరగా వేపుకోవాలి.
వేపిన జీడిపప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరో పాత్రలో పంచదార నీటిని చేర్చి పాకం తయారు చేసుకోవాలి.
పాకం ఉడికాక అందులో రుబ్బిన జీడిపప్పు పొడి, ఏలకుల పౌడర్ వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి 10 నిమిషాల తర్వాత డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి.

No comments:

Post a Comment