Thursday, June 5, 2014

ఆవ పులిహోర

పులిహోర అనగానే అందరికి గుర్తొచ్చేది గుడిలో ఇచ్చే పులిహోర. అదేంటోగాని ఆ పులిహోర రుచి ఇంట్లో చేస్తే రాదు. ఇక తిరుమలలో గుడిలో ఇచ్చే పులిహోర రుచి మాత్రం ప్రత్యేకమైనది. మరచిపోలేనిది. మామూలుగా చేసుకునే  పులిహోర కాకుండా కాస్త ఘాటుగా ఉండే పులిహోర సంగతులేంటో చూద్దాం..
కావలసిన వస్తువులు :
బియ్యం  – 250 gms
చింతపండు పులుసు – 1/2 కప్పు
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4
మినప్పప్పు – 1 tbsp
ఇంగువ – చిటికెడు
బెల్లం – చిన్న ముక్క లేదా 1/4 tsp చక్కెర
పసుపు – 1/4 tsp
ఆవపొడి  – 1/4 tsp
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు – తగినంత
నూనె – 3 tbsp
బియ్యం కడిగి, అరగంట నానబెట్టి కొంచెం బిరుసుగా వండాలి.  ప్రతి మెతుకు విడివిడిగా ఉండాలి. ఒక చెంచాడు ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి.  ఒక గిన్నెలో చింతపండు పులుసు, బెల్లం,  పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి చిక్కబడేవరకు ఉఢికించాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడి కాస్త రంగు మారాక మినప్పప్పు వేసి కొద్దిసేపు వేయించాలి. ఉడికించి పెట్టుకున్న పులుసును ఈ పోపులో వేసి మరికొద్దిసేపు ఉడికించి దింపేయాలి. ఈ పులుసును అన్నంలో వేసి బాగా కలిపి , ఆవపొడి కూడా వేసి, ఉప్ప సరిచూసుకొని మొత్తం బాగా కలియబెట్టాలి. అరగంట  అలా వదిలేసి అ తరవాత వడ్డించండి. ఘాటైన ఆవ పులిహోర తయారు. ఆవపొడి దగ్గర జాగ్రత్త.  ఇది చివర్లో కలపాలి. కొలత చూసుకుని వేయాలి. ఎక్కువైతే చేదుగా ఉంటుంది. వేడి చేస్తుంది.

No comments:

Post a Comment