పిస్తా కుల్ఫీ
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీ.
పంచదార.. పావు కేజీ
బ్రెడ్.. ఒక స్లైస్
బాదంపప్పు.. 20
పిస్తాపప్పు.. అర కప్పు
యాలక్కాయలు.. నాలుగు
కుంకుమపువ్వు.. కాస్తంత
తయారీ విధానం :
పాలు ఒక పాత్రలో పోసి అర లీటర్ అయ్యేంతదాకా బాగా మరిగించాలి. మరిగించిన పాలు చల్లారిన తరువాత అందులో పంచదార, బ్రెడ్, నీటిలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్ చేసిన బాదంపప్పు ముద్ద, పైన పొట్టుతీసేసి పలుకులుగా చేసుకున్న పిస్తాపప్పు, యాలక్కాయలు, కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి.
కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్ సెట్ చేసి అందులో పాల మిశ్రమం పోయాలి. దానికి ఓ ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చి.. 12 గంటలపాటు కుల్ఫీమౌల్డ్‌ని ఫ్రీజర్‌లో ఉంచాలి. తరువాత కుల్ఫీ మౌల్డ్స్‌ని బయటికి తీసి వేడినీటిలో ముంచినట్లయితే అందులోని కుల్ఫీ సులభంగా బయటికి వచ్చేస్తుంది. అంతే చల్ల చల్లగా అలరించే పిస్తా కుల్ఫీ రెడీ..! మంచి రుచిగా, కూల్‌గా ఉండే ఈ కుల్ఫీలను చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు.

No comments:
Post a Comment