Tuesday, June 10, 2014

కుడుములు


కుడుములు


వినాయక చవితి రోజున కుడుములు నైవేద్యంగా పెట్టడం సంప్రదాయం. ఉండ్రాళ్లు, కుడుములంటే వినాయకుడికి ప్రీతికరం. అలాంటి కుడుములను ఎలా చేయాలో చూద్దామా.. 


కావాల్సిన పదార్థాలు :
బియ్యం : 1 గ్లాస్‌, 
కొబ్బరి తరుము : 1 కప్‌, 
శనగపప్పు : 2 టేబుల్‌ స్పూన్‌,
ఉప్పు : తగినంత

తయారీ విధానం : ముందుగా ఓ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టవ్‌పై పెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా రవ్వ కలపాలి. రవ్వ, శనగపప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత క్రిందకు దించి కొబ్బరి తురుమును చల్లాలి. చల్లారిన తరువాత ఉండలు చుట్టుకుని ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి ఆవిరి మీద ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే కుడుములు రెడీ.

No comments:

Post a Comment