Tuesday, June 10, 2014

మోదుగలు

మోదుగలు

కావలసిన పదార్థాలు :
 పైపూత కోసం -బియ్యం- రెండు కప్పులు,
 ఉప్పు-తగినంత, 
నూనె-ఒక టేబుల్ స్పూన్. 
లోపల పెట్టడానికి - బెల్లం లేదా పంచదార-ఒక కప్పు,
కొబ్బరి తురుము-ఒక కప్పు, 
నెయ్యి-2 టేబుల్ స్పూన్లు.  

తయారుచేసే విధానం : ముందుగా బియ్యాన్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీటిని వడగట్టి శుభ్రమైన తెల్లని బట్టపై నీడన ఆరబోయాలి. బాగా ఆరిన తరువాత ఆ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి.

స్టవ్‌పై ఒక పెద్ద పాత్రను ఉంచి అందులో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, నూనె వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగే సమయంలో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. దోశల పిండి మాదిరిగా తయారైన తరువాత దించేసి చల్లార్చాలి. తరువాత స్టవ్‌పై బాణలి ఉంచి కొద్దిగా నెయ్యి వేసి బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగిన వెంటనే దింపేసి అందులో కొబ్బరి తురుము వేయాలి. దాన్ని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు బియ్యం పిండిని కొద్దిగా తీసుకుని చిన్న ఉండలా చేసుకుని దాన్ని అరచేతిలో గారె మాదిరిగా వెడల్పు చేయాలి. స్పూన్‌తో కొబ్బరి తురుము కొద్దిగా తీసి ఆ గారె మధ్యలో పెట్టి అంచులు మడతబెట్టి గుండ్రంగా వచ్చేలా చుట్టాలి. ఇలా అన్నిట్నీ చేసుకున్న తరువాత వాటిని ప్రెషర్ కుక్కర్‌లోకాని, ఇడ్లీ కుక్కర్‌లోకాని ఆవిరిపై పది నిమిషాలు ఉడికించాలి.  

No comments:

Post a Comment