Tuesday, June 10, 2014

తుమ్మికూర పప్పు

తుమ్మికూర పప్పు


కావలసిన పదార్థాలు :
 తుమ్మికూర-ఒక కట్ట, 
కందిపప్పు-అర కప్పు, 
ఉల్లిపాయ-ఒకటి, 
టమాట-ఒకటి, 
కారం-అర టీస్పూన్, 
పసుపు-అర టీస్పూన్, 
చింతపండు-తగినంత, 
ఎండుమిరప కాయలు-రెండు, 
జీలకర్ర-అర టీస్పూన్, 
పల్లీ నూనె-అర టీస్పూన్, 
తరిగిన వెల్లుల్లి ముక్కలు-అర టీస్పూన్, 
పచ్చి శెనగపప్పు-అర టీస్పూన్, 
మినప్పప్పు-అర టీస్పూన్, 
ఆవాలు-అర టీస్పూన్, 
కరివేపాకు-నాలుగు ఆకులు, 
ఉప్పు-తగినంత.

తయారుచేసే విధానం : తుమ్మికూరను ముందుగా శుభ్రమైన నీటిలో కడిగి కాస్త పెద్దగానే కోసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పు, తరిగిన తుమ్మికూర ముక్కలు, ఉల్లిపాయ, టమాట ముక్కలు, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. తరువాత కుక్కర్ దించేసి లోపలి పప్పును మెత్తగా యెనపాలి.

ఇప్పుడు స్టవ్‌పై బాణలి ఉంచి కొద్దిగా నెయ్యి వేసి, అందులో వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పచ్చి శెనగ పప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి తిరగమోత పెట్టాలి. దీన్ని పప్పులో కలిపేయాలి. ఈ తుమ్మికూర పప్పు అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment