Tuesday, June 10, 2014

ఆంధ్ర ప్లమ్ కేక్

ఆంధ్ర ప్లమ్ కేక్


ఆంధ్ర ప్లమ్ కేక్ కావలసినవి
Andhra plum cake
 మైదా - 500 గ్రా.,
కోడిగుడ్లు - 11
బటర్ - 500 గ్రా.
పంచదార (పొడి చేయాలి) - 450 గ్రా.
బేకింగ్ పౌడర్ - 10 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - 100 ఎం.ఎల్
ఫ్రూట్ జామ్ మిక్స్ - 50 గ్రా.
క్యారెమల్ కలర్ - 40 గ్రా.
ప్లమ్ ఫ్రూట్స్ - 750 గ్రా.
దాల్చిన చెక్క + ఏలకుల పొడి- 10 గ్రా.
వంటసోడా- అర టీ స్పూన్
లిక్విడ్ గ్లూకోజ్ - 100 ఎం.ఎల్

 ఆంధ్ర ప్లమ్ కేక్ తయారి 
Andhra plum cake
 ఒక పాత్రలో మార్గరిన్, పంచదారపొడి వేసి కలపాలి. ఎగ్‌బీటర్‌తో గుడ్లసొనను గిలకొట్టాలి. ఈ సొనను పంచదార పొడిలో వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేంతవరకు బాగా గిలకొట్టాలి. మైదా, దాల్చినచెక్క, ఏలకులపొడి కలిపి జల్లించాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తర్వాత దీంట్లో ప్లమ్ ఫ్రూట్స్, గ్లూకోజ్, క్యారమెల్ కలర్ వేసి మరోసారి కలపాలి. పిండి ముద్ద బాగా మెత్తగా అయ్యాక తగినంత తీసుకొని కేక్‌ను బేక్ చేసే పాత్రలో వేసి, పాత్రంతా పరుచుకునేలా చేత్తో మృదువుగా అదమాలి. ఆ పాత్రను అవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 నుంచి 45 ని.లు బేక్ చేసి, తీయాలి. కేక్‌ను నచ్చిన అలంకరణతో వేడుకకు సిద్ధం చేసుకోవాలి.

No comments:

Post a Comment