Thursday, June 5, 2014

నువ్వుపొడి పులిహోర

పులిహోర లో మరో ప్రముఖమైన రుచి నువ్వుపొడి. ఇది చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. అప్పుడప్పుడు చింతపండు పులిహోర నువ్వుపొడి కలిపి చేసి చూడండి.
కావలసిన వస్తువులు:
బియ్యం – 200 gms
చింతపండు పులుసు – 1/2 కప్పు
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
వేరుశనగగుళ్లు/పల్లీలు – 2 tbsp
ఇంగువ – చిటికెడు
పసుపు – 1/4 tsp
నువ్వుపొడి – 2 tbsp
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 3 tbsp
అన్నం కాస్త బిరుసుగా వండాలి.  ప్రతి మెతుకు విడిగా ఉండాలి. అన్నంలో చెంచాడు నూనె,సగం పసుపు, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. ప్యాన్ లో  మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు, వేరుశనగ గుళ్లు , పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి నిదానంగా ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడ్డాక నువ్వుల పొడి వేసి మరి కొద్దిసేపు ఉడకనిచ్చి, నూనె తేలిన తర్వాత దింపేయాలి. ఈ పులుసు అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. కనీసం పదినిమిషాలు అలా ఉండనిచ్చి వడ్డిస్తే రుచిగా ఉంటుంధి. ఇంట్లో ఏదైనా పూజలు, పండగలు ఉన్నప్పుడు చేస్తే బావుంటుంది. ప్రయాణాల్లో అందరికి తప్పకుండా గుర్తొచ్చేది పులిహోరనే కదా..

No comments:

Post a Comment