Tuesday, June 10, 2014

బెల్లంకుడుములు

బొజ్జగణపయ్యకు బెల్లంకుడుములు

వినాయకునికి ఉండ్రాళ్ళు ఎంత ముఖ్యమో కుడుములు కూడ అంత ముఖ్యమే...తెలుగు వారింట్లో కుడుములు లేని చవితి ఉండదు.కుడుములు చేయడం చాలా తేలిక.పది గంటల పాటు బియ్యాన్నినీటిలో నానపెట్టాలి.తరువాత  బియ్యాన్ని నీళ్ళు వడవేసి మిక్సిలో పిండి పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి నీళ్ళు పోసి వేడి చేయాలి.అందులో చిటికెడు ఉప్పు,ఒక టేబుల్ స్పూను పంచదార వేసుకుని నీళ్ళు మరిగించుకుని అందులో కొద్దిగా బియ్యం పిండిని చల్లటి నీళ్ళలో కలిపి వేడి నీటిలో కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.దీన్ని కొట్ర కాయడం అంటారు.స్టవ్ పై నుంచి గిన్నె దించుకుని చల్లారిన తరువాత మిగత పిండిలో కొట్రను వేసి సరిపడ బెల్లంవేసి గట్టిగా కలుపుకోవాలి.ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని వెడల్పుగా వత్తుకుని ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవాలి.ఈ ప్లేట్లనుకుక్కర్ లో నీళ్ళు పోసి పెట్టుకోవాలి.కుక్కర్ పైన వెయిట్ పెట్టకూడదు. పది నిమిషాల పాటు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ దించుకోవాలి.రెండు నిమిషాల అయిన పిదప మూత తీసి ఉడికిన కుడుములను తీసుకుని వేరే ప్లేటులో సర్దుకోవాలి.కమ్మని సంప్రదాయమైన కుడుములు రడీ.

కావల్సిన పదార్ధాలు...


బియ్యం... ఒక కిలో(నీళ్ళలో నానపెట్టుకోవాలి)
బెల్లం...ముప్పావు కిలో

No comments:

Post a Comment