Monday, June 9, 2014

కమ్మటి రుచుల ఓట్స్ దద్దోజనం..

కమ్మటి రుచుల ఓట్స్ దద్దోజనం..

కావలసిన వస్తువులు:
ఓట్స్ – 1/2  కప్పు
పాలు – 1/2  కప్పు
పెరుగు – 1/2 కప్పు
ఎండుమిరపకాయలు – 1
పచ్చిమిరపకాయలు – 1
ఆవాలు – చిటికెడు
జీలకర్ర- చిటికెడు
మినప్పప్పు – 1/4 టీస్పూన్
సెనగపప్పు – 1/4 టీస్పూన్
కరివేపాకు – ఐదు ఆకులు
అల్లం – చిన్న ముక్క
ఉప్పు – తగినంత
తురిమిన క్యారట్ -1 టీస్పూన్
సన్నగా తరిగిన కొత్తిమిర – 1/2 టీస్పూన్
నూనె – 1 టీస్పూన్
ఓట్స్‌ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పెట్టుకోండి. పాలు మరిగించి ఈ ఓట్స్‌పై వేసి కలిపి ఉంచాలి. ఆ వేడికి అవి మెత్తబడతాయి. మూడు నిమిషాలు అలా ఉంచాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపాక కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి మరో నిమిషం వేయించాలి. ఈ పోపును చిలికిన పెరుగులో వేయాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలియబెట్టాలి. ఈ పోపు పెట్టిన పెరుగును ఓట్స్‌లో వేసి బాగా కలియబెట్టాలి. సన్నగా తరిగిన కొత్తిమిర,  తురిమిన క్యారట్‌తో అలంకరించాలి. అరగంట ఫ్రిజ్‌లో పెట్టి తింటే చల్లగా బావుంటుంది. అలా ఐనా తినొచ్చు. అర్జెంట్ అనుకుంటే పెరుగులో పోపు చేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టి కావలసినప్పుడు పాలు, ఓట్స్ కలుపుకోవచ్చు.

No comments:

Post a Comment