Thursday, June 12, 2014

బ్రెడ్ పూర్ణాలు...

బ్రెడ్ పూర్ణాలు...

కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ - ఒక ప్యాకెట్ (పెద్దది),
బియ్యం - ఒక కప్పు,
మినపప్పు - అర కప్పు,
క్యారెట్ తురుము - ఒక కప్పు,
పంచదార - ఒక కప్పు,
నూనె - తగినంత,
సోడ - చిటికెడు,
నెయ్యి - అర కప్పు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - సరిపడా,
యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేయు విధానం: 
బియ్యం, మినపప్పు కలపి ముందురోజు నానబెట్టుకోవాలి. తరువాతి రోజు వీటని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. క్యారెట్‌ని సన్నగా తురుముకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఇందులో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ని నీళ్లలో ముంచి గట్టిగా పిండేయాలి. దీన్ని క్యారెట్ తరుములో కలుపుకోవాలి. కొద్దిగా వేగాక పంచదార కూడా వేసి బాగా కలిపి దించేయాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బి పెట్టుకున్న బియ్యం, మినపప్పు పిండిలో కొద్దిగా సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి. ఈ పిండిలో బ్రెడ్ ఉండల్ని ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే బ్రెడ్ పూర్ణాలు రెడీ.

No comments:

Post a Comment