Thursday, June 12, 2014

స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్

స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్

కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - ఐదు,
కోడి గుడ్లు - రెండు,
పంచదార పొడి - 50గ్రాములు,
సోడా - చిటికెడు,
నూనె - తగినంత.
తయారుచేయు విధానం:
ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా సోడా కూడా వేసి స్పూనుతో బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టాలి. బాగా వెడెక్కాక రెండు స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని గోడు గుడ్డు మిశ్రమంలో ముంచి పైనంపై వేసి వేయించాలి. రెండు పక్కలా ఎరుపు రంగు వచ్చే వరకూ కాల్చాలి. అంతే తియ్యటి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.

No comments:

Post a Comment