Sunday, June 8, 2014

డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ-ట్రెడిషనల్ పంజాబ్ రిసిపి


డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ-ట్రెడిషనల్ పంజాబ్ రిసిపి

డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ-ట్రెడిషనల్ పంజాబ్ రిసిపి

కావల్సిన పదార్థాలు: 
పెరుగు: 1cup 
మామిడి పండు: 1(పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) 
బాదం: 4-5(పొడి చేసుకోవాలి) 
పిస్తా: 3-4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) 
పంచదార: 3tsp 
రోజ్ వాటర్ : రెండు మూడు చుక్కలు 
ఐస్ క్యూబ్స్: 3-4 

తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకొని దాన్ని వాగా గిలకొట్టాలి. 
2. తర్వాత బ్లెండర్ లో పెరుగు మరియు మామిడి పండు ముక్కలు, కొద్దిగా నీళ్ళు , పంచదార వేసి గ్రైండ్ చేయాలి.
3. మాండిపండ్లు బ్లెండ్ అయిన తర్వాత అందులో రోజ్ వాటర్ కూడా వేసి మరో రెండు మీరు సెకండ్లు బ్లెండ్ చేయాలి . 
4. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వేరే గిన్నెలోనికి వడగట్టుకోవాలి. మామిడి గుజ్జు ఫైబర్ తొలగిపోతుంది. 
5. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, అందులో ఐస్ క్యూబ్స్ వేసి తర్వాత అందులో మ్యాంగో లస్సీపోయాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. మీకు అవసరం అనిపిస్తే బ్లెండ్ చేసేప్పుడు కూడా డ్రైఫ్రూట్స్ ను యాడ్ చేసుకోవచ్చు. అంతే డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ త్రాగడానికి రెడీ.

No comments:

Post a Comment