Sunday, June 8, 2014

మ్యాంగో - ఐస్ క్రీమ్ స్మూతీ..


మ్యాంగో - ఐస్ క్రీమ్ స్మూతీ.. సమ్మర్ స్పెషల్

మ్యాంగో - ఐస్ క్రీమ్ స్మూతీ.. 
కావల్సిన పదార్థాలు: 
మ్యాంగో: 5-6 
పాలు: 1/2cup(చల్లనివి) 
పంచదార: 6-7tbsp(మామిడిపండ్ల సంఖ్యను బట్టి) 
వెనీలా ఐస్ క్రీమ్: 2స్కూప్స్ 
నీళ్ళు: కొద్దిగా(అవసరమైతేనే) 

1. ముందుగా మామిడి పండ్ల పొట్టు తీసి సన్నసన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
2. ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తబడే వరకూ బ్లెండ్ చేసుకోవాలి. 
3. తర్వాత ఇందులో పంచదార కూడా వేసి ఒక నిముషం పాటు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. 
4. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ను ఒక బౌల్లోనికి వంచుకోవాలి. ఇప్పుడు దీనికి చల్లటి పాలను మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసి స్మూతీ తయారు చేసుకోవాలి. 
5. చివరగా వెనీలా ఐస్ క్రీమ్ ను కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి బాగా షేక్ చేయాలి. అంతే మ్యాంగో స్మూతీ రెడీ. దీన్ని జ్యూస్ గ్లాస్ లో నింపి చల్ల.. చల్లగా అందించడమే ఆలస్యం.


No comments:

Post a Comment