Thursday, June 12, 2014

బఠాణీ బ్లాస్ట్

బఠాణీ బ్లాస్ట్



కావలసిన పదార్థాలు
-------------------------
పచ్చి బఠాణీ: పావుకిలో
పనీర్: పావుకిలో
టమోటాలు: పావుకిలో
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: చిన్న ముక్క
పెరుగు: ఒక కప్పు
జీడిపప్పు: కొంచెం
ఉప్పు: తగినంత
ఉల్లిపాయ : ఒకటి
అల్లం వెల్లుల్లి: ఒక స్పూను
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: అర స్పూను
గరం మసాలా: చిటికెడు
కారం: ఒకటిన్నర స్పూను
కార్న్‌ఫ్లోర్: మూడు స్పూన్లు
రిఫైన్డ్ ఆయిల్: ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ విధానం
--------------------
గినె్నలో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, త పసుపు వేసి వేయించాలి. దీనిలో తురిమిన పనీర్ వేసి కాస్సేపు వేయంచి తీసి పక్కన పెట్టుకోవాలి. పనీర్ మిశ్రమంలో చిటికెడు ఉప్పుకలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించాలి. ఈ ఉండల్ని నూనెలో ఎర్రగా వేయించి పక్కన వుంచుకోవాలి.
ఓ గినె్నలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము వేయాలి. నూనె పైకి తేలేవరకూ వేయించాలి. ఆపైన అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కారం, మిగిలిన పసుపువేసి మరికొంత సేపు వేయంచాలి. తరువాత గ్రైండ్ చేసిన టమోటా జ్యూస్ పోసి నూనె పైకి తేలేలా వేయించాలి. దీనిలో ముద్దగా నూరిన జీడిపప్పు, పెరుగు కలిపి సన్నని మంట మీద ఉంచితే గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీలో ఉడికించిన పచ్చి బఠాణీ, ఫ్రై చేసిన పనీర్ ఉండలు కలపాలి. తరువాత గరంమసాలా, ఉప్పు వేసి సన్నటి సెగపై కాస్సేపు వుంచాలి.

No comments:

Post a Comment