Thursday, June 12, 2014

బ్రెడ్ హల్వా

బ్రెడ్ హల్వా

కావాల్సినపదార్థాలు:
పాలు - ఒక లీటరు,
పంచదార - 350 గ్రాములు,
బ్రెడ్ - ఆరు ముక్కలు,
యాలకులు - ఐదు,
నెయ్యి - 350 గ్రాములు,
జీడిపప్పు - 150 గ్రాములు.
తయారుచేయు విధానం: 
ముందుగా యాలకులను పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పుని నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు ఓ పావులీటరు పాలల్లో పంచదార, బ్రెడ్ వేసి నానబెట్టాలి. మిగిలిన పాలని బాగా మరిగించాలి. గరిటతో కోవాలా అయ్యే వరకూ తిప్పాలి. ఈ లోపల బ్రెడ్ నాని, పంచదార కరిగిపోతుంది. కోవా తయ్యారవ్వగానే నానినబ్రెడ్, పంచదార మిశ్రమాన్ని అందులో వేసేయ్యాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసి సన్నని మంటపై అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరికయ్యాక దించేసి యాలకులపొడి వేసి కలపాలి. జీడిపప్పుతో అలకరించుకుంటే బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment