Monday, June 9, 2014

నెయ్యి దద్దోజనం




నెయ్యి దద్దోజనం

కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
ఎసరునీరు.. ఒకటింపావు లీ.
తాజా గట్టి పెరుగు... అర లీ.
చిక్కటి కాచిన పాలు... పావు లీ.
నెయ్యి... వంద గ్రా.
కరివేపాకు... నాలుగు రెమ్మలు
ఎండుమిర్చి... ఐదు
పచ్చిమిర్చి... ఐదు
అల్లం తరుగు... ఒక టీ.
ఆవాలు... రెండు టీ.
ఇంగువపొడి... అర టీ.
మిరియాలు... రెండు టీ.
పసుపు... పావు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బియ్యం కడిగి ఎసట్లో వేసి కాస్త మెత్తగా ఉడికించాలి. అన్నం చల్లారనివ్వాలి. పెరుగులో నీళ్లు పోయకుండా గిలకొట్టి పసుపు, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి తురుము వేసి కలపాలి. నేతిలో ఎండుమిర్చి, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి సువాసన వచ్చేవరకూ వేయించి పెరుగులో కలపాలి.

ఇప్పుడు ఒక పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో పై మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి. అందులోనే పాలు కూడా పోసి బాగా కలిపి మూత పెట్టేయాలి. అంతే నెయ్యి దద్దోజనం రెడీ అయినట్లే...! పెరుగు మాత్రమే వేసినట్లయితే దద్దోజనం త్వరగా పులిసిపోతుంది. కాబట్టి, పాలు కలపడంవల్ల రుచి పెరుగుతుంది. చిక్కగానూ ఉంటుంది.

No comments:

Post a Comment