Monday, June 9, 2014

పెరుగన్నం లేదా దద్దోజనం

పండగ రోజులలో దేవుడికి చేసే నైవేద్యాలలో పెరుగన్నం లేదా దద్దోజనం , పులిహోర, పొంగలి, చక్రపొంగలి ప్రముఖమైనవి. ముఖ్యంగా ధనుర్మాసంలో అమ్మవారికి రోజు నైవేద్యం చేస్తాము కదా. ఆ అమ్మకు చాలా ఇష్టమైన దద్దోజనం ఇవాళ చేసుకుందాం.
కావలసిన వస్తువులు:
బియ్యం 100 gm
పెరుగు 100 ml
పాలు 100 ml
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
అల్లం ముక్క 1″
కరివేపాకు 2 రెబ్బలు
నెయ్యి 2 tbsp
ఇంగువ – చిటికెడు
ముందుగా అన్నం మెత్తగా వండి గరిటతో మెత్తగా చేసి, తగినంత ఉప్పు కలిపి పెట్టుకోవాలి. పాలు పెరుగు బాగా కలిపి ఉంచుకోవాలి. నెయ్యి వేడి చేసి ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు,శనగపప్పు,
కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి కాస్త వేపి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు ఈ పెరుగును అన్నంలో వేసి బాగ కలిపి పది నిమిషాల తర్వాత వడ్డించండి.  దద్దోజనం మొత్తం పెరుగుతో చేస్తె పుల్లగా అవుతుంది. పాలు పెరుగు కలిపి చేస్తే కమ్మగా ఉంటుంది రోజంతా.  ఇది నిమ్మకాయ ఊరగాయతో కలిపి తింటే అదుర్స్. ఈ పెరుగన్నం ప్రయాణాలలో కూడా తీసికెళ్లవచ్చు.

No comments:

Post a Comment