Tuesday, June 10, 2014

బేసిన్ లడ్డు



బేసిన్ లడ్డు 

కావలసిన పదార్థాలు: 
శనగపిండి: 2cups 
నెయ్యి: 1/2cup 
బొబ్బాయి రవ్వ: 4tbsp 
పంచదార పొడి: 1cup 
యాలకుల పొడి: 1tsp 
బాదంపలుకులు: 5 
ద్రాక్ష: 5-10 
ఫుడ్ కలర్(పసుపు): చిటికెడు

 తయారు చేయు విధానం: 
1. ముందుగా బాదం పలుకులు, కిస్ మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. 
2. పాన్ లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా గోధుమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి. పిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. 
3. మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో యాలకుల పొడి కలపాలి. తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. 
4. మరొక పాన్ లో పంచదార, ఫుడ్ కలర్ వేసి కలిపి, వేడి చేయాలి. 
5. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్ మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. అంతే బేసిన్ లడ్డు రెడీ



No comments:

Post a Comment