Thursday, June 5, 2014

దబ్బకాయతో పులిహార

దబ్బకాయతో  పులిహార
దబ్బకాయ అంటే నిమ్మకాయ వంశానికి చెందినదే. కాకపోతే నిమ్మకాయకంటే పెద్దగా ఉంటుంది. రుచి మాత్రం నిమ్మకాయలాగే పుల్లగా ఉంటుంది. అందుకే దబ్బకాయతో కూడా  పులిహార చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు:
అన్నం – 2 కప్పులు
దబ్బకాయ రసం – 1/4 కప్పు
పసుపు – 1/4 tsp
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
శనగపప్పు – 1 tsp
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమిర – 2 రెమ్మలు
నూనె  – 3 tbsp
పులిహోరకి అన్నం కాస్త బిరుసుగా, ప్రతి పలుకు విడివిడిగా ఉండాలి.  ప్యాన్ లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, కరివేపాకు,మినప్పప్పు, శనగప్పప్పు వేసి కొద్దిగా రంగుమారేవరకు వేయించి దబ్బకాయ రసం వేసి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపి సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి కలిపి పది నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment