Free shipping any ware in India For best Deals on Tupperware Products, Dry fruits, Oriflame beauty products plz Contact email: somulakshmisaran@gmail.com
Saturday, September 27, 2014
Monday, September 22, 2014
Wednesday, September 17, 2014
ఔషద మొక్కలు.. 3. వస ( "పిల్లలకి వస ఎప్పుడు పోయాలి" )
పల్లెల్లో దీనిని వజ అని కూడ పిలుస్తారు. సంస్కృతంలో ‘వచు’ లేదా ‘ఉగ్రగంధ’ అంటారు. ఇది దుంప జాతి మొక్క. వరి పండించే అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమే. దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం వుండి సుమారు ఒకటి.... రెండడుగుల పొడవు వుంటాయి. వస చెట్టు తేమగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది.
కూరగాయ తోటలకు పెట్టినట్టే దీనికి కూడ నీటి తడులివ్వాలి. తల్లి దుంపలకున్న చిన్న పిలక దుంపలతో దీనిని ప్రవర్థనం చేయ వచ్చు. నాటిన సుమారు పది నెలలకు దుంపలు తయారవుతాయి.
తయారయిన దుంపలను త్రవ్వి తీసి దానికున్న కాండాని, చిన్న వేరులను తీసి వేసి, ఆ దుంపలను ముక్కలుగా చేసి ఎండ బెట్టి అమ్ముకోవచ్చు.
వీటిని ఔషదాలు, సువాసన ద్రవ్వాలు, మొదలగు వాటిలో వాడతారు. ఆయుర్వేద మందుల దుఖాణాలలోకూడ దీనిని అమ్ము కోవచ్చు.
గతంలో పల్లె ప్రజలు ఈ వజ కొమ్మును నీటితో నూరి చిన్న పిల్లలకు నాకించే వారు. దాంతో వారికి మాటలు తొందరగా వస్తాయని నమ్మే వారు.
సమతూకంగా వస పొయ్యకుండా ఎక్కువ పోస్తే గలగలా మాట్లాడతారు. దీని నుండి పుట్టినదే ఈ జాతీయము "వస పిట్టలాగ వాగు తున్నావె" ఎక్కువగా మాట్లాడె పిల్లలను .."మీ అమ్మ నీకు వజ చాల ఎక్కువగా పోసినట్టుంది" అంటుంటారు. అలాంటి వాళ్లని సంబోధించి వీడికి వసెక్కువ పోశారంటారు. శరీర వాపును కూడా ఈ వస చెట్టు వేళ్ల రసం తగ్గిస్తుందని ఆయుర్వేదంలో ఉంది.
పసితనంలో తొందరగా మాటలు రావడానికి వస కొమ్మును అరగదీసి తేనెతో కలిపి పోస్తారు. అలా పోస్తే మాటలు స్పష్టంగా, చక్కగా, త్వరగా వస్తాయి.

పిల్లలకి వస ఎప్పుడు పోయాలి
చిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు. అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది.
వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది. దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి ఈ వసకొమ్ముని దానిమీద మూడుసార్లు తిప్పి దానిని పిల్లలకి నాకించాలి.
పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది. దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు. వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు. దానికీ సమయముంది. ఆదివారంగానీ, బుధవారంగానీ వసపొయ్యాలి. ఆదివారంనాడుపోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి బుధ్ధిమంతులూ, తెలివితేటలుకలవాళ్ళూ అవుతారని అంటారు.
వసవల్ల ఉపయోగాలు ..
పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది
దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కపమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి. వస వేళ్ళను గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణలోను, మూత్రపిండ వ్యాధులలోను బొల్లి మచ్చల నివారణలో వాడతారు.
వోకల్ కార్డ్స్ ని శుభ్రపరుస్తుంది. స్వరం చక్కగా వస్తుంది. నాలుక మందంపోయి చక్కగా మాట్లాడతారు. మేధో శక్తి పెంచుతుంది. మెదడులో వుండే నరాలని ఉత్తేజపరుస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. క్రిమి సంహారిణిగా కూడా పని చేస్తుంది. పిల్లలు చురుకుగా చక్కగా పెరిగేటట్లు చేస్తుంది.

ఇన్ని ఉపయోగాలున్న వసని మీ బిడ్డలకూ ఇవ్వండి. అయితే తగు మోతాదులో మాత్రమే ఇవ్వాలనే విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం )
Sunday, September 14, 2014
ఔషద మొక్కలు ... 2.అశ్వగంధ (యవ్వనంగా ఉంచే అశ్వగంధ)
కేన్సర్‌పై జరిగిన పలు పరిశోధనలలో అశ్వగంధ అనే మొక్క కేన్సర్ వ్యాధి త్వరగా తగ్గడానికి, సహకారి ఔషధంగా ఉపయోగ పడుతున్నట్లు గమనించారు. అలాగే ఈ మొక్క కేన్సర్ కణాల పెరుగుదల రేటును గణీయంగా తగ్గించడమే కాకుండా, కేన్సర్‌పై రేడియేషన్ ప్రభావాన్ని పెంచడంతోపాటు, రేడియేషన్ వలన ఆరోగ్యకణాలకు కలిగే హాని నుంచి రక్షణ కలిగించినట్లు కూడా గమనించారు.
అశ్వగంది, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి. అశ్వగంధి అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతాయి. మనిషిలోని ఆందోళన, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది. అక్షనాళము, డెనడ్రాన్లను పెంపొందించి ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది.
కలబంద - సాగు విధానము
కొన్ని ప్రాంతాలలో దీనిని "కూటి కలబంద" అని అంటారు. దీని శాస్త్రీయ నామము 'అలోవిరా'.
ఇది ఎడారి మొక్క. నీటి వసతి లేకున్నా ఇది తట్టు కోగలదు.
నీటి వసతి తో కూడ సాగు చేయ వచ్చు. నీటి వసతి తో సాగు చేస్తే దిగుబడి ఎక్కువ వుంటుంది. నీరు నిలవని అన్ని ప్రాంతాలలో దీనిని సాగు చేయ వచ్చు.
దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం కలిగి కలిగి వుంటుంది. అందులో వుండే పారదర్శక పదార్థమే ఔషదాల కొరకు ఉపయోగిస్తారు.
పిలకల ద్వార దీనిని ప్రవర్థనం చేయవచ్చు. దీని పెద్ద మొక్క చుట్టు అనేక పిలకలు వస్తాయి. వాడిని తీసి నాట వచ్చు.
దీని ఆకులను గాని, ఆకుల మధ్యలోవుండే 'జెల్ ' పదార్థాన్ని వేరు చేసిగాని అమ్ముకోవచ్చు.
దీనిని ప్రతి సౌందర్య సాధన ఉత్పత్తులైన సబ్బులు, ముఖానికి రాసుకునే క్రీములు మరియు అనేక రకములైన ఔషదాలలో ఉపయోగిస్తారు. దీని పెరుగుదల తక్కువ. నీటి వసతి కింద పెంచే టప్పుడు దీనిలో కూరగాయల పంటలను అంతర పంటలుగా వేసుకుంటే ప్రత్యేకంగా దీనికి ఎరువులు వేయ నవసరంలేకుండా పెరుగుతుంది. నీరు నిలవ వుండని అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమె.
అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు - ఔషదమొక్కలు 1.కలబంద (కలబంద మొక్కలో త్రిమూర్తులు )
సాధారణంగా 'కలబంద' మొక్కలు అడవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొంతమంది ఇళ్లలో కూడా ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదని కొంతమంది అంటూ ఉంటారు. మరికొందరు ఆ మాటలను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు కలబంద మొక్క మంచిదేనా ? దానిని ఇంట్లో పెంచడం వలన దోషం ఉంటుందా ? అనే సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి.
అయితే కలబంద మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చనీ, దానివలన ఉపయోగాలే తప్ప నష్టాలైతే లేవని ఇటు ఆధ్యాత్మిక గ్రంధాలు ... అటు ఆయుర్వేద వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. కలబంద మొక్కలో త్రిమూర్తులు ఉంటారనీ ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతూ ఉంటే, అనేక రకాల వ్యాధులను నివారించడంలో అది ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.
ఇక కలబంద మొక్క ఉన్న ఇంటి ఆవరణలోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఎలాంటి దుష్ట శక్తులకి సంబంధించిన మత్రప్రయోగాలనైనా కలబంద మొక్క నిర్వీర్యం చేస్తుందని చెప్పబడుతోంది. ఇక దిష్టి ప్రభావాప్రభావానికి గురికాకుండా ఇది ఇంటిని కాపాడుతూ ఉంటుంది. కనుక కలబంద ఇంటి ఆవరణలో ఉండకూడదనేది కేవలం అపోహగానే భావించాలి. ఇటు ఆధ్యాత్మిక పరంగాను ... అటు ఆరోగ్య పరంగాను తులసి మొక్కలానే కలబంద కూడా మానవాళికి మహోపకారం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఘన జీవామృతం.... తయరు
ఘన జీవామృతం....
రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి..!
దుక్కిలో ఎకరాకు వంద కిలోల ఘన జీవామృతాన్ని వేస్తే డీఏపీలాంటి ఎరువుల అవసరం ఉండదు. ట్రాక్టర్ పశువుల పేడలో 50 లీటర్ల ఆవు మూత్రం, 16 కిలోల బెల్లం, 16 కిలోల శనగపిండి, 4 కిలోల పుట్ట మట్టిని బాగా కలిపి పైన నీళ్లు కొద్దిగా చల్లి 15 రోజుల పాటు మాగపెట్టాలి. ఆ తర్వాత ఆ ఎరువును ఉపయోగించుకోవచ్చు.
జీవామృతాన్ని రెండు కిలోల చొప్పున బెల్లం, శనగపిండి, 5 నుంచి పది కిలోల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, పిడికెడు పుట్టమట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం సాయంత్రం కలుపుతూ రెండు రోజులు నానబెట్టాలి. దానికి మరో 200 లీటర్ల నీరు కలుపుకోవాలి. మూడో రోజు నుంచి 15 రోజుల్లోపు వాడుకోవాలి. ఆ జీవామృతాన్ని పైరుపై పిచికారీ చేయడానికి లీటర్ నీటికి 20 మి.లీ. కలుపుకోవాలి. దీంతో చీడపీడలు దరిచేరవు. మొక్కకు 10 మి.లీ. చొప్పున నేరుగా పోసుకోవచ్చు.
దీంతో యూరియా అవసరమే ఉండదు. పదిహేనురోజులకోసారి పైరుపై పిచికారీ చేసుకోవడంతో పాటు మొక్కకు నేరుగా ఇదే తరహాలో అందిస్తే పంట దిగుబడి ఆశించిన విధంగా వస్తుంది. బంతి పూల వంటి పంటకు ఎకరాకు 15 రోజులకు వెయ్యి లీటర్ల జీవామృతం సరిపోతుంది. వరి పైరుకు 600 లీటర్ల జీవామృతాన్ని నెలకోసారి నీటి ద్వారా పారిస్తే సరిపోతుంది. అవసరాన్ని బట్టి అగ్నిఅస్త్రం, పుల్లటి మజ్జిగను పైరుపై పిచికారీ చేయాలి.
ఐదెకరాల్లో ఏడాదికి రూ.3 లక్షల ఆర్జన..!
సచివాలయ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావుకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఆయన సూచనలతో రెండేళ్ల నుంచి సేంద్రి య సాగు చేపట్టాను. చాలా బాగా అనిపించింది. ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు 5 ఎకరాల్లో ఏడాదికి పెట్టుబడి పోను రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ఒక దేశీయ ఆవుతో 5 ఎకరాల్లో ఈ తరహా సాగు చేపట్టవచ్చు. చాలా సులభమైన విధానం ఇది. చాలా మందిని ప్రోత్సహిస్తున్నాను. అధికారుల ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నాను. ఆయా పద్ధతులను ఇతర రైతులకు చూపిస్తున్నాను.

వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు...!
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు...!
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో..
వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇలా వాడుకోవాలి..
వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి.
పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు.
యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి.
యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది.
నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం.
నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది.
పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు.
వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది.
నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది.
పండ్ల తోటల్లో వినియోగం ఇలా..
పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు.
గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి.
అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది.
వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది.
వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్‌లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది.

‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!
‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!
- 600 యూనిట్లకు రూ. 18 లక్షల సబ్సిడీ మంజూరు
- సబ్సిడీ పోను 18 బస్తాల మట్టి మిశ్రమం సహా యూనిట్ ధర రూ. 3 వేలు
- మట్టి మిశ్రమం వద్దనుకుంటే రూ. వెయ్యి తగ్గింపు
సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండించుకోదలచిన హైదరాబాద్ మహాన గరవాసులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిపంట కిట్లపై సబ్సిడీ పథకానికి పచ్చజెండా ఊపింది. 4 నెలల్లో 600 యూనిట్ల పంపిణీ ద్వారా నగరంలోని మేడల మీద, ఖాళీ స్థలాల్లో 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరల పెంపకాన్ని ప్రోత్స హించాలన్నది లక్ష్యం. యూనిట్ ధర రూ. 6 వేలు. సగం సబ్సిడీ పోను లబ్ధిదారు రూ. 3 వేలు చెల్లించాలి. యూనిట్‌లో భాగంగా 4 సిల్పాలిన్ (40 చదరపు అడుగులు) బెడ్స్, దేశవాళీ విత్తనాలు, వేపపిండి, వేపనూనె, ఇతర పరికరా లతోపాటు 18 బస్తాల మట్టి మిశ్రమం (ఎర్రమట్టి 50%+ పశువుల ఎరువు 25%+ కొబ్బరిపొట్టు 25%) ఇస్తారు. మట్టిమి శ్రమం వద్దనుకునే వారు రూ. వెయ్యి తగ్గించి చెల్లించే సదుపాయం ఉందని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయకుమార్ ‘సాక్షి’తో చెప్పా రు.
మొదటి పంటకు టమాటా, వంగ, మిరప, క్యాప్సికం నారు, తర్వాత రెండు పంటలకు సరిపడా విత్తనాలు కూడా ఇస్తామన్నారు. సబ్సిడీ కిట్లతో సంబంధం లేకుండా కూడా 50% సబ్సిడీతో దేశవాళీ విత్తనాలను అందు బాటులో ఉంచుతున్నామన్నారు. ఇంటి పంటల సాగుపై ప్రతి 15 రోజులకోసారి వర్క్‌షాపులు నిర్వహిం చనున్నట్లు విజయ కుమార్ వివరించారు. ఇంటిపంట సబ్సిడీ కిట్లను పొందాల నుకునే నగరవాసులు http://horticulture. tg.nic.in/ వెబ్‌సైట్‌లో ‘డౌన్‌లోడ్స్’ నుంచి దరఖాస్తును పొందవచ్చు.
మట్టి మిశ్రమం తోపాటు ఇంటిపంట కిట్ కావాలనుకునే వారు రూ. 3 వేలు, మట్టి మిశ్రమం వద్దను కునే వారు రూ. 2 వేలకు ‘డిప్యూటీ డెరైక్టర్ హార్టికల్చర్, గవర్నమెంట్ గార్డెన్స్, హైద రాబాద్’ పేరిట డీడీ తీయాలి. పూరించిన దరఖా స్తుకు డీడీ జత చేసి రెడ్‌హిల్స్‌లో నాంపల్లి కోర్టుల పక్కన గల హార్ట్టికల్చర్ ట్రైనింగ్‌ఇన్‌స్టిట్యూట్(హెచ్‌టీఐ)లో అధి కారులకు అందజేసి.. కిట్‌ను తీసుకెళ్ల వచ్చ ని విజయకుమార్ వివరించారు. వివరాల కు ఉద్యాన విస్తరణాధికారి నవీన్ (99491 61042) లేదా ఉద్యాన అధికారిణి అరుణ (8374449458)ను సంప్రదించవచ్చు. publicgardens@gmail.comకు మెయిల్ ఇవ్వొచ్చు.

Saturday, September 13, 2014
లింగాష్టకం
బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ |
కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభి రేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ అష్టదళోపరివేష్టితలింగంసర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ లింగాష్టక మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే |
Tuesday, September 9, 2014
అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు - ఔషదమొక్కలు 1(తిప్పతీగ (అమృత/గుడూచి))
తిప్పతీగ (అమృత/గుడూచి)
క్షయ వ్యాధికి ఆధునిక ఔషధాలతోపాటు తిప్పతీగ అనే ఔషధ మొక్కను ఉపయోగించడం వలన ఆధునిక ఔషధాల దుష్ప్రభావాలు తగ్గి నట్లు గమనించారు. అంతే కాకుండా, ఆ ఔషధాలు బాగా పని చేసేందుకు సహాయకారి ఔష ధంగా ఉపయోగపడినట్లు, మరణాల శాతం తగ్గించగలిగినట్లు వెల్లడైంది.

తిప్పతీగను ప్రతి రోజు సేవించడం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
తిప్పతీగ కారముగ చులకనగ పాకము వలన రుచికరముగ ఆయురారోగ్యవృద్ధికారిగనుండును. మలమునుగట్టి పరచును. వగరును ఉష్ణముగ బలకారిగ చేదుగనుండును. ఆగ్నిదీపనమును చేయును. రక్తదోషము, వాంతి, వాతము, భ్రమము, పాండువు, ప్రమేప ̈ాము, రక్తవ ̧లము, శ్లేష ్̈మము, కాస ̈ము, దాురదా, మేదోరోగము, విస ̈ర్పము, కామిల, కుష ̈ు్టవు, వాతరక్తము, జ్వరము, పిత్తము, క్ర ̃ వి ురోగ వ ు, వీనినిప ̈ ా రింప ̈ జ ే య ు ను. తిప ̈ ్ప తీ గ ను ఫ ̈ ు ృత వ ుతోడ సేవించినవాతమును, బెల్లముతోడ సేవించిన మలబద్ధామును, ప ̈ంచదారతోడ సేవించిన పిత్తమును, తేనెతోడ సేవించిన కఫమును, ఆముదాముతో సేవించిన ప్ర ̈ బ లమయిన వాత ర క ్త వ ును, శొంట ̃ త ోడ సవించిన ఆమ్ల వత వ ు దాుప శమింప జేయును. దీని ముఖాక ̃ప ̈యోగము జ్వరము స ̈ంప ̈ారించుట, వ ̧త్రాశయము గోదించుటయునునది.

Monday, September 8, 2014
అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు - ఔషదమొక్కలు
అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు
అపార్ట్‌మెంట్ ఇళ్లలో సైతం ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది.
ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగత పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుతాయి. అందులో కొన్ని మీకోసం...
కరివేపాకు

కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటే. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
కలబంద

కలబందను చిన్న చిన్న కుండీలలోనూ, సంచుల్లోనూ పెంచుకోవచ్చు. కలబంద ఇంటిలో పెంచుకుంటే వేసవి కాలంలో ఆ ఇల్లు ఎంతో చల్లగా ఉంటుంది. కంటి సమస్యలను, తలనొప్పి తదితర సమస్యలను దూరం చేస్తోంది.
ఇంటిలో పెంచేందుకు పెద్ద స్దలం అవసరం లేదు. చిన్న కుండీలోను కలబందను పెంచవచ్చు. ప్రతినిత్యం రెండుపూటలా నీరును అందిస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మార్కెట్లో వివిధ రకాల్లో ఈ మొక్కలు లభిస్తున్నాయి. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం అవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

చందనం మొక్క: దీనికి తేమగల పొడి నేలలు అవసరము. ఈ మొక్క భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. చందనం మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చర్మసంరక్షణకు ఎంతో మేలు..చందనము వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, చర్మ సంబందిత మందుల తయారీలో వినియోగిస్తున్నారు. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు. చందనం వాడకంతో సౌందర్యం పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖాన్ని చంద్రబింబంలా ఉంచే శక్తి చందనానికు ఉంది.
తమలపాకులు:
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి.తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
తులసి:

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా అకు పచ్చ రంగులో ఉండేది లక్ష్మి తులసి. కృష్ణ తులసి ఆకులు, కొమ్మలు కాస్త నలుపు కలిసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ఆకు ఘాటుగా ఉంటుంది. ఔషద విలువలు రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయి.ఇది వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం కలిసికట్టుగా దాడిచేస్తాయి. తులసితో వాటన్నింటినీ ఎదుర్కొనవచ్చు..
పసుపు

ఇంకా పసుపు, మలబార్, అల్లం, కైయున్నాం, లెమన్‌గ్రాస్, బ్రాహ్మీ, మునగ తదితరవాటిని పెంచుకోవటానికి తక్కువ స్థలం చాలు. ఈ మొక్కలు ఇళ్లలో ఉంటే శ్వాసకోశ, వత్తిడి తదితర సమస్యల నుంచి బయటపడేస్తాయి. మునగ ఆకు మల్టీవిటమిన్‌గా ఉపకరిస్తోంది. పసుపు, అల్లం ఆకులు ఔషధాల తయారీకి ఎంతో ఉపకరిస్తాయి.
మనం నివసించే చిన్న ఇంటిలోనే మొక్కలను పెంచాలనే ఆసక్తి ఉంటే ఔషధ మొక్కలను ఎంపికచేసుకుంటే పచ్చదనంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలు ఎన్నింటినో చిన్న చిన్న సంచులలో పెంచుకునే వీలుంది. ఈ ఆకుకూరలు పెంచటం వల్ల ఇంటికి అవసరమైన కూరలు సమృద్ధిగా వస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. ఆసక్తి కనబరిచే ఔత్సాహికులు కార్యరంగంలోకి దిగి మీ ఇంటిని పచ్చదనాల ఔషధ మొక్కల పొదరిల్లుగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది.
అశ్వగంధ

అశ్వగంధ వేర్లు దగ్గు, రూమాటిసం, అల్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి. అల్లం, శొంటి అనేవి పన్ను నొప్పి, కంటి సంబంధ వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. స్మైలాక్స్ నుంచి లభించే సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలకు పని చేస్తుంది.దాల్చిన చెక్క డయేరియా, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఎపిడ్రిన్ ఆల్కలాయిడ్ జలుబు, ఆస్తమా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అట్రోపా నుంచి లభించే అట్రోపిన్ ప్లాస్టర్స్ తయారీకి తోడ్పడుతుంది. క్రోకస్ (కుంకుమ పువ్వు) కీలం, కీలాగ్రాలు, నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి.
దతూర పత్రాల నుంచి లభించే స్ట్రమోనియంను ఆస్తమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను నయం చేస్తుం ది. పెన్సీలియం క్రైపోజినం అనే శీలింధ్రం నుంచి పెన్సిలిన్ యాంటీ బయాటిక్‌ను తయారు చేస్తున్నారు. పసుపు ఒక యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. ఇది అల్సర్, జాండిస్, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్‌ను గౌట్, రూమాటిసం వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఫేరులా వేళ్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుంది.
అపార్ట్‌మెంట్ ఇళ్లలో సైతం ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది.
ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగత పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుతాయి. అందులో కొన్ని మీకోసం...
కరివేపాకు
కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటే. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
కలబంద
కలబందను చిన్న చిన్న కుండీలలోనూ, సంచుల్లోనూ పెంచుకోవచ్చు. కలబంద ఇంటిలో పెంచుకుంటే వేసవి కాలంలో ఆ ఇల్లు ఎంతో చల్లగా ఉంటుంది. కంటి సమస్యలను, తలనొప్పి తదితర సమస్యలను దూరం చేస్తోంది.
ఇంటిలో పెంచేందుకు పెద్ద స్దలం అవసరం లేదు. చిన్న కుండీలోను కలబందను పెంచవచ్చు. ప్రతినిత్యం రెండుపూటలా నీరును అందిస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మార్కెట్లో వివిధ రకాల్లో ఈ మొక్కలు లభిస్తున్నాయి. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం అవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
చందనం మొక్క: దీనికి తేమగల పొడి నేలలు అవసరము. ఈ మొక్క భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. చందనం మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చర్మసంరక్షణకు ఎంతో మేలు..చందనము వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, చర్మ సంబందిత మందుల తయారీలో వినియోగిస్తున్నారు. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు. చందనం వాడకంతో సౌందర్యం పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖాన్ని చంద్రబింబంలా ఉంచే శక్తి చందనానికు ఉంది.
తమలపాకులు:
తులసి:
తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా అకు పచ్చ రంగులో ఉండేది లక్ష్మి తులసి. కృష్ణ తులసి ఆకులు, కొమ్మలు కాస్త నలుపు కలిసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ఆకు ఘాటుగా ఉంటుంది. ఔషద విలువలు రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయి.ఇది వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం కలిసికట్టుగా దాడిచేస్తాయి. తులసితో వాటన్నింటినీ ఎదుర్కొనవచ్చు..
పసుపు
ఇంకా పసుపు, మలబార్, అల్లం, కైయున్నాం, లెమన్‌గ్రాస్, బ్రాహ్మీ, మునగ తదితరవాటిని పెంచుకోవటానికి తక్కువ స్థలం చాలు. ఈ మొక్కలు ఇళ్లలో ఉంటే శ్వాసకోశ, వత్తిడి తదితర సమస్యల నుంచి బయటపడేస్తాయి. మునగ ఆకు మల్టీవిటమిన్‌గా ఉపకరిస్తోంది. పసుపు, అల్లం ఆకులు ఔషధాల తయారీకి ఎంతో ఉపకరిస్తాయి.
మనం నివసించే చిన్న ఇంటిలోనే మొక్కలను పెంచాలనే ఆసక్తి ఉంటే ఔషధ మొక్కలను ఎంపికచేసుకుంటే పచ్చదనంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలు ఎన్నింటినో చిన్న చిన్న సంచులలో పెంచుకునే వీలుంది. ఈ ఆకుకూరలు పెంచటం వల్ల ఇంటికి అవసరమైన కూరలు సమృద్ధిగా వస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. ఆసక్తి కనబరిచే ఔత్సాహికులు కార్యరంగంలోకి దిగి మీ ఇంటిని పచ్చదనాల ఔషధ మొక్కల పొదరిల్లుగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది.
అశ్వగంధ

అశ్వగంధ వేర్లు దగ్గు, రూమాటిసం, అల్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి. అల్లం, శొంటి అనేవి పన్ను నొప్పి, కంటి సంబంధ వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. స్మైలాక్స్ నుంచి లభించే సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలకు పని చేస్తుంది.దాల్చిన చెక్క డయేరియా, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఎపిడ్రిన్ ఆల్కలాయిడ్ జలుబు, ఆస్తమా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అట్రోపా నుంచి లభించే అట్రోపిన్ ప్లాస్టర్స్ తయారీకి తోడ్పడుతుంది. క్రోకస్ (కుంకుమ పువ్వు) కీలం, కీలాగ్రాలు, నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి.
దతూర పత్రాల నుంచి లభించే స్ట్రమోనియంను ఆస్తమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను నయం చేస్తుం ది. పెన్సీలియం క్రైపోజినం అనే శీలింధ్రం నుంచి పెన్సిలిన్ యాంటీ బయాటిక్‌ను తయారు చేస్తున్నారు. పసుపు ఒక యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. ఇది అల్సర్, జాండిస్, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్‌ను గౌట్, రూమాటిసం వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఫేరులా వేళ్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుంది.
Subscribe to:
Posts (Atom)