Monday, September 8, 2014

కిచెన్ గార్డెన్ లో ఓకేచోట పెరగని రెండు మొక్కలు.

ఇంట్లో గార్డెన్ పెంచుకోవాలనే అభిరుచి, ఆసక్తి ఉంటే చాలు. పెరటి తోట కావచ్చు, టైపైన లేదా కుండీల్లో కిచెన్ గార్డెన్ కావచ్చు.. పెంచే వారి అభిరుచి, ఇష్టాఇష్టాలను బట్టి వారి కిచెన్ గార్డెన్ తీరుతెన్నులుంటాయి.


 ఒకరికి ఇష్టమైన కూరగాయలు, ఆకుకూరలు మరొకరికి ఇష్టం ఉండవు. అయితే, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూరగాయ మొక్కలన్నీ కలసి పెరగవు. ఏవేవి కలసి పెరగడానికి అవకాశం ఉందో, ఏవేవి కలసి పెరగవో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 

పెరటి తోటల పెంచుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. కొన్ని మొక్కలను ప్రత్యేకంగా విడిగా ట్రేల్లో, నేలమీద మడుల్లో, కుండీల్లో నాటినా.. మరికొన్ని మొక్కలను, ఇతర మొక్కలకు దగ్గరలోనో లేదా అదే కుండీలోనో కలిపి నాటుకోవచ్చు. కానీ అన్ని రకాల మొక్కలు కలిసి పెరగవు. 
కిచెన్ గార్డెన్ లో ఓకేచోట పెరగని రెండు మొక్కలు...

మొక్కలు కలిపి నాటేటప్పుడు వాటి కాపు సమయం వేరు వేరుగా ఉండేవి నాటాలి. అప్పుడు నేలలోని పోషకాల కోసం పోటీ అంత ఎక్కువగా ఉండదు. కలిసి పెరగలేని మొక్కలను ఒకే కుండీలో కలిపి పెంచకూడదు. పెరట్లోగాని, మేడమీద గాని, నేలమీద కానీ కూరగాయల మొక్కలు సాగుచేస్తున్నప్పుడు కూడా కలిసి పెరిగే మొక్కలే పక్క పక్కన వచ్చేలా చూసుకోవడం మంచిది. 

కలిసి పెరగలేని మొక్కలను ఒకే చోట నాటాల్సి వస్తే.. వాటి మధ్య దూరం, వాటి వేళ్లు కలవనంత దూరంలో నాటుకోవడం ఉత్తమం. సాధారణంగా మొక్క కొమ్మలు ఎంత స్థలంలో విస్తరిస్తాయో.. నేలలో వాటి వేళ్లు కూడా అంతమేరకు విస్తరిస్తాయి. పక్కపక్కనే నాటుకునే మొక్కల ఎంపిక విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొన్లైతే పెరటి తోటల్లో, టై గార్డెన్లలో కూర గాయల ఎక్కువగా పండించవచ్చు. 

మొక్కల పెంపకం హాబీ పిల్లలను ఆకర్షిస్తుంది. ఇతరులతో పోలిస్తే గార్డెన్ ఉన్న ఇంట్లో పిల్లల్లో చురుకుదనం ఎక్కువ. వాడేసిన టీ కాఫీ పొడులు, కోడిగుడ్డు పెంకులు, ఇంకా ఇతర వ్యర్థాలు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. అరుదైన పూల మొక్కలు పెంచితే మీ ప్రత్యేకత పెరుగుతుంది. ఔషధ ప్లాంట్లు మాత్రమే పెంచితే హాబీ, ఆరోగ్యం, అమ్మితే లాభం కూడా. కాస్త ఎక్కువ స్థలం ఉంటే ఇది సాధ్యం.

2 comments:

  1. కలిసి పెరగలేని మోక్కలు పేర్లు ఏంటి

    ReplyDelete
  2. ఒక కుండీలోనో లేదా ఒక చదరపు అడుగులోనో ఒకటే మొక్క పెంచాలన్న భావన నగరాలు, పట్టణాల్లో ఇంటిపంటలకు నప్పదు. తక్కువ చోటులోనే ఎక్కువ పంటలను పండించుకోవడం ఉత్తమం. అయితే, పోషకాల కోసం తమలో తాము పోటీపడని రకాల మొక్కలను ఒకే కుండీలో కలిపి పెంచుకోవాలి. ఉదా.. వంగ కుండీలో పాలకూర వంటి ఆకుకూరలు వేసుకోవడం మంచిది. కుండీలో 2 అడుగుల వరకు వంగ మొక్క వేళ్లు చొచ్చుకెళ్తే.. పాలకూర మొక్క వేళ్లు 3-4 అంగుళాలకు మించి వెళ్లవు. అయితే, వంగ దిగుబడి 75%కు పరిమితం కావచ్చు. కానీ, వంగతోపాటు పెరిగే ఆకుకూరల్లో పూర్తిస్థాయి దిగుబడి పొందొచ్చు. పాలకూరతోపాటు ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర కూడా కలిపి వేసుకోవచ్చు. వెల్లుల్లి, కొత్తిమీర వల్ల పాలకూరకు చీడపీడల బెడద రాదు. టై గార్డెన్‌లో కూరగాయలతోపాటు ఎక్కువ ఆకుకూరలు పెంచుకోవడం ఇలాగైతేనే సాధ్యం.

    ReplyDelete