Thursday, September 4, 2014

మామిడికాయ ఆవకాయ పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడికాయలు: 10
  • ఉప్పు : 1/2 కేజీ
  • కారం : 1/2 కేజీ
  • ఆవపిండి : 1/2 కేజీ
  • మెంతులు : 50గ్రా.
  • శెనగలు : 50గ్రా.(నచ్చినవారు వేసుకోవచ్చు)
  • వేరుశెనగ నూనె : 1 కేజీ

తయారీ విధానం

1. ముందుగా మామిడికాయలు ముక్కలుగా కోసినవి తెచ్చుకోవాలి.
2. ఆ ముక్కలను ఒక పెద్ద గుడ్డ(చీర ముక్క లాంటిది) మీద పరచాలి.
3. ఒక్కొక్క ముక్కను తీసుకొని, పాత గుడ్డతో శుభ్రంగా తుడిచి దానికి ఉన్న టెంకె పై పొరనంతా తీసివేయాలి.
4. ఒక పెద్ద బేసిన(విశాలమైన పాత్ర) తీసుకొని ఆ మామిడి ముక్కలను వేసి, వాటిపై ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా అన్ని ముక్కలకు కలిసేలా కలపాలి.
5. తరువాత నూనె కూడా వేసి బాగా కలిపి ఒక జాడీ లో పెట్టాలి.
6. మూడవరోజు జాడీ మూత తీసి పచ్చడిని అంతా బాగా తిరగ కలపాలి.
7. ఇష్టమైన వారు పొట్టు ఒలిచిన వెల్లుల్లి పాయలను పచ్చడిలో కలుపుకోవచ్చు.
8. పచ్చడి నిల్వ ఉంచిన జాడీ( ప్లాస్టిక్ డబ్బా)ను ఒక్ చిన్న గుడ్డ ముక్కతో వాసర కడితే పచ్చడికి గాలి అస్సలు తగలక తోందరగా ఎండిపోదు, అలాగే రంగు మారదు.

No comments:

Post a Comment