Wednesday, September 3, 2014

కుర్‌కురీ భేండీ

Picture
కావలసిన పదార్థాలు :
బెండకాయలు - 50ఱగా.
శనగపిండి - 4 స్పూన్స్
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :
బెండకాయలను కడిగి కాసేపు ఆరనివ్వాలి. ఒక్కో బెండకాయని నిలువుగా నాలుగు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ఆమ్‌చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేయాలి. ఆ మిశ్రమం మొత్తం బెండకాయలకు పట్టేవిధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్క ముక్కను నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. నోరూరించే.. కుర్‌కురీ భేండీ రెడీ!

No comments:

Post a Comment