Thursday, September 4, 2014

పెసర అప్పడాలు


కావలసినవి:
 పెసరపిండి - పావు కేజీ; నూనె - అర కేజీ; ఇంగువ - టీ స్పూను; బియ్యప్పిండి - 50 గ్రా.; కారం - రెండు టీ స్పూన్లు; ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:
ఇంగువను కొద్దినీటిలో నానబెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో పెసరపిండి, కారం, ఉప్పు, ఇంగువనీరు పోసి బాగా కలిపి, సుమారు 12 గంటలసేపు నానబెట్టాలి. కొద్దికొద్దిగా నూనె జత చేస్తూ, రోట్లో వేసి ఈ పిండిముద్దని బాగా దంచాలి.పిండిని బయటకు తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వరిపిండిలో అద్దుకుంటూ అప్పడాలు ఒత్తుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకుంటే కావలసినప్పుడల్లా వేయించుకుని తినవచ్చు.

No comments:

Post a Comment