రేగుపండ్లు - కప్పు
ఎండుమిర్చి - 10
ఉప్పు - తగినంత
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - అర టీ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి
ముందుగా రేగుపండ్లను శుభ్రంగా కడిగి, తడి పోయేంతవరకు గాలికి ఆరనివ్వాలి. తర్వాత రోట్లో కొద్ది కొద్దిగా రేగుపండ్లను వేస్తూ కచ్చాపచ్చాగా దంచాలి. దీంట్లో అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, చేత్తో అదిమి, నూనె రాసిన ప్లేట్‌లో ఉంచాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అన్ని అప్పాలను ఒత్తి, ఎండలో ఆరబెట్టాలి. నాలుగైదు రోజులు ఎండలో బాగా ఆరనిచ్చి, గట్టిపడ్డాక నిల్వచేసుకోవాలి. వీటిని కావలసినప్పుడు ఏడాది పొడవునా తినవచ్చు.
No comments:
Post a Comment