Thursday, September 4, 2014

సగ్గుబియ్యం ఒడియాలు

DSCN2835
వీటిని సగ్గుబియ్యం వడియాలంటారు. పెట్టుకోడం తేలికే. వేయిచుకుని తింటే చిరుతిండిగా బాగుంటాయి
పెట్టుకోలేమంటారా? కొన్ని ప్రయత్నం చేసి పెట్టుకోవచ్చు. మిగిలినవాటిని మీరు కోరితే పల్లెలనుంచి తెచ్చి అమ్మడానికి సిద్ధంగానే ఉంటారు, ప్రయత్నించండి. బాగుంటేనే కొంటామని చెప్పండి, చక్కగా తయారు చేసి తెస్తారు, మీకు ఉపయోగం, మరొకరికి పని కల్పించి, జీవనాధారం ఏర్పాటు చేసినవారవుతారు కదా!

జంక్ కంటే మంచిది,ఆలోచించండి :)

కావలసిన పదార్థాలు

  • సగ్గుబియ్యం - 1 డబ్బా
  • పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ
  • ఉప్పు - తగినంత
  • నిమ్మకాయలు - 2

తయారీ విధానం

1. ముందురోజు రాత్రి సగ్గుబియ్యాన్ని నీళ్ళలో నానపెట్టుకోవాలి.
2. 1 డబ్బా సగ్గుబియ్యానికి 14 గ్లాసులనీళ్ళు పోసి(అంత పలుచగా వద్దనుకుంటే 8 గ్లాసులు సరిపోతాయి) బాగా మరిగించాలి.
3. సగ్గుబియ్యం ఉడికి, చిక్కబడే వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి.
4. దానిలో మిరపకాయల పేస్టుని కలుపుకొని, బాగా కలియ తిప్పి స్టొవ్ ఆపాలి.
5. ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి బాగా కలిపి, చిన్న వడియాలలా గరిటతో పలుచటి ప్లాస్టిక్ పేపరు మీద పెట్టి ఎండలో ఉంచాలి.
6. ఈ వడియాలను విడిగానూ, అన్నములో నంచుకునీ తినవచ్చు.

No comments:

Post a Comment