Monday, September 8, 2014

హార్టీకల్చర్ థెరపీ

విషపు రసాయనాలు, రసాయనిక ఎరువులు, కలుషిత నీరు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచీ!.. కానీ ఇప్పుడలా పండిస్తున్నదెవరు? అయినా.. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామాల్లో అయినా ప్రకృతిసిద్ధంగా పెంచిన ఆహారం ఎక్కడ దొరుకుతాయిలెద్దూ.. అని నిరుత్సాహపడుతున్నారా? ఎక్కడి దాకో ఎందుకు చెప్పండి? ఆసక్తి ఉంటే మీరే.. మీ ఇంటిపట్టునే నిక్షేపంగా పండించుకోవచ్చు. ఇంటిపట్టున కాస్త ఖాళీ స్థలం ఉంటే సరేసరి. లేదంటే కుండీలు, మడుల్లో  సులువుగానే ఇంటిపంటలు సాగు చేసుకోవచ్చు. ఉదయపు నీరెండలో ఇంటిపంటల పనులు చేస్తుంటే.. అలసిన మనసుకు ఎంత గొప్ప రిలీఫో కదండీ..? దీన్నే ‘హార్టీకల్చర్ థెరపీ’ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కమ్మని ఆకుకూరలు, కూరగాయలకు ఇది బోనస్ అన్నమాట. 

కుండీల్లో కమ్మని ఆకుకూరలకు హాయ్.. చెబుదామా?

No comments:

Post a Comment